Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా బోర్డు పరీక్షలు రాయాలి

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా బోర్డు పరీక్షలు రాయాలి

- Advertisement -

– ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు ధూపటి వెంకటేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మస్థైర్యంతో బోర్డు పరీక్షలు రాయాలని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు దూపటి వెంకటేష్ సూచించారు.బుధవారం ఆలేరు మండల కేంద్రంలోని ఏకశిల స్కూల్లో ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్ అధ్యక్షత వహించగా,దూపటి వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ  తరగతి విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.పరీక్షల సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని,మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు.విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ మండల కమిటీని ఆయన అభినందించారు.

టాలెంట్ టెస్ట్‌లో మొదటి బహుమతిని ఏకశిలా స్కూల్‌కు చెందిన చంద శృతి కీర్తన గెలుచుకోగా, రెండవ బహుమతిని జె. సుదీక్ష, జీడిగారి అఖిల్ సాధించారు.మూడవ బహుమతిని ఎన్.శ్రీ చందన అందుకున్నారు.కన్సోలేషన్ బహుమతులను జేఎంఎజె స్కూల్‌కు చెందిన శుభ్రతం,శ్రీ రామకృష్ణ విద్యాలయం తరఫున ఎల్. కార్తీక్ చైతన్య గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు మద్దెల సాయి గణేష్, సభ్యులు సాయిని కళ్యాణ్, పాఠశాల బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -