Tuesday, February 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి. డాక్టర్ ఉమాశ్రీ

విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి. డాక్టర్ ఉమాశ్రీ

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
పదవ తరగతి విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా తమ పరీక్షలను రాయాలని మండల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సందర్శించి పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ( స్ట్రెస్ మేనేజ్మెంట్)మానసిక ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పరీక్షలు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని సరైన నిద్ర మంచి ఆహారం ,యోగ, మెడిటేషన్ మానసిక ఒత్తిడి నివారించవచ్చని విద్యార్థులకు  సూచించారు. ఫలితాలు ఏ విధంగా వచ్చిన సానుకూల దృక్పథంతో ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం  గిరిజనఆశ్రమ పాఠశాల స్టోర్ రూమ్  భోజనశాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామన్న గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజం, హెల్త్ సూపర్వైజర్ జంగమ్మ, MLHP పల్లవి, హెల్త్ అసిస్టెంట్ లు కొల్లూరి కమలాకర్,ఎండి రషీద్ ఖాన్, సుభక్త,గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -