Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థినులు

పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థినులు

- Advertisement -

–  పసుపు పంటపై అవగాహన 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన పలువురు విద్యార్థినులు సోమవారం సందర్శించారు. ప్రోగ్రెసివ్ రైతు వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మహిళ కళాశాల విద్యార్థినులు కమ్మర్ పల్లి పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థినులు పసుపు పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు పంటపై జరుగుతున్న వివిధ పరిశోధనలు, ఆధునిక సాగు పద్ధతులు, పసుపు రకాల ప్రదర్శన (ఎగ్జిబిషన్), పంట ఉత్పత్తి పెంపు పద్ధతుల గురించి రైతులకు వివరించారు.

పసుపు ఉడికించడం, అరబెట్టడం, పాలిషింగ్ విధానాలను, పసుపు ప్రాసెసింగ్‌కు ఉపయోగించే యంత్రాలను, వ్యవసాయ పనిముట్లను క్షేత్రస్థాయిలో విద్యార్థినులకు చూపించి వాటి వినియోగంపై వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పసుపు పంట సాగులో నూతన సాంకేతికతలు, వ్యాధి నివారణ చర్యలు, మార్కెట్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. పరిశోధన కేంద్రాన్ని సందర్శించడం పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. సందర్శనలో భాగంగా తాము నేర్చుకున్న అంశాలు తమకు ఎంతో  ప్రాంతంలో అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విద్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -