Sunday, September 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే మంచి భవిష్యత్తు..

విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే మంచి భవిష్యత్తు..

- Advertisement -

మాజీ జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర
నవతెలంగాణ – జన్నారం

విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని జన్నారం మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పైడిపల్లి గార్డెన్స్లో రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటుగా క్రమశిక్షణ ఎంతో అవసరమని, క్రమశిక్షణ లేని వారు దారం తెగిన గాలిపటంతో సమానమని అన్నారు.

క్రమశిక్షణ కల్గిన వారు ఉన్నత శిఖరాలు అధిగమిస్తారని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని, అదేవిదంగా మీ తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, యాజమాన్యానికి మంచి పేరు తేవాలని కోరారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుని మొదటి సంవత్సర విద్యార్థిని విద్యార్థులకు రెండవ సంవత్సర విద్యార్థులు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమములో డీన్ హేమలత షిండే, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్, రాఘవేంద్ర లిటిల్ హన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్,అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -