నవతెలంగాణ – జుక్కల్
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి జుక్కల్ మండలంలోని ఖండేబెల్లుర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, కౌలాస్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల, జుక్కల్ మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ స్ పాఠశాలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్లో నేర్చుకున్న విద్యను పుస్తకాలను విద్యాభ్యాసం చేయించారు. పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో ఎటువంటి ఒత్తిడి కి లోను డిప్రెషన్లో ఉండకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. నిత్యం క్రమశిక్షణగా ఉంటూ ఉపాధ్యాయులు నేర్పించిన విద్యను అభ్యసించాలని అప్పుడే తాము అనుకున్నా లక్ష్యాలను చేరుకోగలుగుతారని అన్నారు.
ఉన్నత చదువులు చదివి ఐఏఎస్,ఐపీఎస్, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి విద్యను అభ్యసించి ఉన్నత పదవులలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు అందరికీ ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందని, ప్రతి ఒక్క విషయాలను బాద్యత తీసుకుని అన్ని విధాలుగా పేద విద్యార్థుల కొరకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులు, మధ్యాహ్నం భోజనం, పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అని అన్నారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి మంచిగా జిల్లా , రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించాలని తెలిపారు. ఉన్న ఊరు కన్నతల్లి ఎలాగో, పాఠశాలలో విద్య నేర్పిన ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల పేర్లు గొప్పలు చెప్పుకునే విధంగా తనవంతుగా కష్టపడి కృషి చేయాలని అన్నారు.
విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ విభాగం సందర్శన
విద్యార్థులలో ఉన్న సైన్స్ విద్య నైపుణ్యాన్ని వెంకి తీసేందుకు ప్రత్యేకంగా సైన్స్ ఫెర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ నమూనాలను తిలకించి వాటి పనితీరుకు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటి బంతిరిను విద్యార్థిని, విద్యార్థులకు అడిగి తెచ్చుకున్నారు. విద్యార్థిని నిర్వహించిన సైన్స్ వేర్ ని చూడముచ్చటగా ఉన్నదాన్ని తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడం గొప్ప విషయం అని అన్నారు.
ఈ సందర్శన కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో తోపాటు ఖండేబల్లుర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ, జుక్కల్ ఎంఈఓ తిరుపతయ్య, ఎమ్మార్వో మారుతి, డిప్యూటీ తాసిల్దార్ హేమలత, ఆర్ఐ రామ్ పటేల్, ప్రధానోపాధ్యాయుడు లాలయ్య, జుక్కల్ జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎం హనుమంత రెడ్డి, కౌలాస్ హెచ్ఎం యాదగిరి, ఎమ్మార్సీ బిల్లు సింగ్ , భీమ్రావు , భీమన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



