Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తహసిల్దార్ కార్యాలయ రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల ధరఖాస్తులపై వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని తహసిల్దార్ గుడిమేల ప్రసాద్ ను ఆదేశించారు. కార్యాలయంలోని కంప్యూటర్, రికార్డుల రూమ్, రిజిస్ట్రేషన్ల గదిని ఆయన పరిశీలించారు. కార్యాలయ సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్, కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -