Wednesday, July 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభూమికి చేరిన శుభాన్షు

భూమికి చేరిన శుభాన్షు

- Advertisement -

సురక్షితంగా ల్యాండ్‌ అయిన డ్రాగన్‌ గ్రేస్‌
వాషింగ్టన్‌ :
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆక్సియం 4 మిషన్‌లోని మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా కాలిఫోర్నియాలోని శాండియాగో సముద్ర తీరంలో ‘డ్రాగన్‌ గ్రేస్‌’ అంతరిక్ష నౌక నుంచి కిందికి దిగారు. 5.7 కిలోమీటర్ల ఎత్తులో అవరోహణను స్థిరీకరించడానికి డ్రోగ్‌ పారాచూ ట్‌లను ఉపయోగించారు. దీంతో ల్యాండింగ్‌ సులభమైంది. ఆ తర్వాత రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన పారాచూట్‌లు తెరుచుకున్నాయి. భూమికి దిగిన వెంటనే శుక్లాతో పాటు బృందంలోని ఇతర సభ్యులను నాసా అధికారులు ఆస్పత్రికి తరలించారు. వీరికి రక్తపోటు, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్‌ స్థాయి తదితర అంశాలపై పరీక్షలు నిర్వహించారు. వారి నుంచి క్యాప్సూల్స్‌ను తొలగించడంతో పాటు రక్తపోటు హఠాత్తుగా పడిపోకుండా వారికి ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని ఇస్తారు. భూమికి చేరిన వెంటనే శుక్లా బృందాన్ని నేరుగా నాసాకు చెందిన జాన్సన్‌ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతరిక్ష ప్రయాణం చేసి వచ్చిన వ్యోమగాముల కడుపులో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది కాబట్టి ముందుగా ద్రవాహారాన్ని అందిస్తారు. ఆ తర్వాత 6-12 గంటల మధ్య వారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాకపోతే తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. అంతరిక్ష యానం చేసిన వ్యోమగాముల శరీరాలు అనేక మార్పులకు లోనవుతాయి. ఎముకల సాంద్రత తగ్గుతుంది. కండరాలు తాత్కా లికంగా బలాన్ని కోల్పోతాయి. అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే వ్యోమగాములను వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -