Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇస్రో విసిట్‌కు ఎంపికైన హారికను సన్మానించిన సుభాష్ రెడ్డి 

ఇస్రో విసిట్‌కు ఎంపికైన హారికను సన్మానించిన సుభాష్ రెడ్డి 

- Advertisement -

– గ్రామానికి  జిల్లాకు దేశ స్థాయిలో పేరు తీసుకురావాలని 
– ప్రముఖ విద్యా ప్రదాత, సమాజ సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి 
నవతెలంగాణ – కామారెడ్డి 

ఇటీవల ఇస్రో (Indian Space Research Organisation) విసిటింగ్ కార్యక్రమానికి జనగామ గ్రామానికి చెందిన  హారికను  ప్రముఖ విద్యా ప్రదాత, సమాజ సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి బుధవారం జనగామ గ్రామంలో  అభినందిస్తూ  సన్మానించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, మీలాంటి విద్యార్థులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

గ్రామానికి చెందిన విద్యార్థి జాతీయ స్థాయి సంస్థను సందర్శించే అవకాశాన్ని పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. హారిక భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, జీవన్ రెడ్డి, సిద్ధరామ్ రెడ్డి , ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని హారికను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -