Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయంసుభాష్‌ముండా యువతకు ఆదర్శం

సుభాష్‌ముండా యువతకు ఆదర్శం

- Advertisement -

– హత్య కేసు కుట్రదారులను శిక్షించాలి : బృందాకరత్‌
– సీపీఐ(ఎం) ఆధ్వర్యాన సంకల్ప్‌ మార్చ్‌
రాంచీ :
ల్యాండ్‌ మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీపీఐ(ఎం) నాయకుడు సుభాష్‌ ముండా యువతకు ఆదర్శమని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బృందాకరత్‌ అన్నారు. సుభాష్‌ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సుభాష్‌ముండా రెండో వర్థంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యాన రాంచీ జిల్లా దలాదలి గ్రామంలో సంకల్ప్‌ మార్చ్‌ నిర్వహించారు. అనంతరం అమరవీరుల చౌక్‌లోని సుభాష్‌ముండా విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బృందాకరత్‌ మాట్లాడుతూ ఎవరి ఆదేశంతో సుభాష్‌ హత్య జరిగిందో సిట్‌ నిర్ధారించకపోవడం సరికాదని అన్నారు. పోలీసులు సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో నిందితులకు బెయిల్‌ లభించిందని అన్నారు. త్వరలో హోం శాఖ కార్యదర్శిని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం కలిసి, సుభాష్‌ముండా హత్య కేసులో కుట్రదారులను శిక్షించాలని కోరతామని అన్నారు. ఈ కేసులో సీఎం హేమంత్‌ సొరేన్‌ జోక్యం చేసుకోవాలని సీపీఐ(ఎం) జార్ఖండ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌ బిప్లవ్‌ కోరారు. ఈ కార్యక్రమంలో సుభాష్‌ ముండా సతీమణి కృతిసింగ్‌ ముండా, కుటుంబ సభ్యులు, పెద్దసంఖ్యలో రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -