Saturday, September 20, 2025
E-PAPER
Homeజిల్లాలునీట మునిగిన సోయపంట..

నీట మునిగిన సోయపంట..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని కందకుర్తి, పేపర్ మిల్, నీలా , బోర్గాం, తాడు బిలోలి గ్రామాలలో సుమారు 7, ఎకరాలలో పంట నీట మునిగిందని వ్యవసాయ అధికారులు అంచనాలు వేస్తున్నారు. గత 48 గంటలుగా సోయా పంటతో పాటు వరి పంట నీట మునిగిందని, ప్రస్తుతం ఆ పంటలు చేతికి వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూత దశకు వచ్చిన పంట మొత్తం గోదావరిలో కలిసిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొగాకు పంట పండించగా వాటి కొనుగోలు విషయంలో నానా అవస్థలు ఎదుర్కొన్న రైతాంగానికి సోయపంట మునగడం మరో దెబ్బ ఎదురైంది. రైతులు కోలుకునే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. సుమారు నాలుగువేల ఎకరాలలో సోయా పంట, మరో మూడు వేల ఎకరాలలో వరి పంట నీట మునిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -