నవతెలంగాణ-కోహెడ
కోహెడ మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను బుధవారం సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. మండలంలో నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించాలని, 50 సంవత్సరాలు దాటిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్ మంజూరు చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సంగేమ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సింగిరాల శ్రీనివాస్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కోశాధికారి కొండూరు రవి, గౌరవ అధ్యక్షులు కుడుమేల్లి పెద్ద మల్లయ్య, గౌరవ సలహాదారు సింగిరాల కనకయ్య, శ్రావణ పెళ్లి కనకయ్య, సలహాదారు మేడిపల్లి తిరుపతి, రాజేశం , చిన్న మల్లయ్య, మోహన్, వెంకటేష్ , ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



