Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎలక్ట్రికల్ రోల్స్ డేటాను కేటగిరీల వారీగా సమర్పించండి

ఎలక్ట్రికల్ రోల్స్ డేటాను కేటగిరీల వారీగా సమర్పించండి

- Advertisement -

రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సి. సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ – వనపర్తి 

ప్రధాన ఎన్నికల కమిషన్ సూచనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పోలింగ్ స్టేషన్ల వారీగా 2025 ఎలక్టరల్ రోల్స్ డేటాను 2002 ఎస్ ఐ ఆర్ డేటా తో వెరిఫై చేసి కేటగిరీల వారీగా సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సి. సుదర్శన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ, తహశీల్దార్లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా చేయాల్సిన పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించి సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల కమిషన్ సూచనల మేరకు 2002లో  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందని, 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ డేటాను 2002 ఎస్.ఐ.ఆర్. డేటా తో మ్యాచింగ్ చేసుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం పోలింగ్ స్టేషన్ల వారీగా 2002, 2025 ఎలక్టరల్ రోల్స్ డేటా వెరిఫై చేసి కేటగిరీల వారీగా సమర్పించాలని ఆదేశించారు. కేటగిరీ ఏ, బీ, సీ, డి ల వారీగా సెప్టెంబర్ 24వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ పోలింగ్ స్టేషన్ల వారీగా 2002, 2025 ఎలక్టరల్ రోల్స్ డేటా వెరిఫై చేసి కేటగిరీల వారీగా సెప్టెంబర్ 24వ తేదీ లోపు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసిల్దార్ రమేష్ రెడ్డి, సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్ తదితరులు వి.సి.లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -