– ఔత్సాహికులకు వెల్‌కం : టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ ముషారఫ్ ఫారూఖీ
నవతెలంగాణ – హైదరాబాద్‌బ్యూరో
ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వ్యక్తులు, సంస్థలకు భారీ సబ్సిడీలు ఇస్తామని టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. ఆసక్తిగలవారు ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీఎమ్ ఈ-డ్రైవ్) స్కీం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ స్కీం ద్వారా వంద నుంచి 70 శాతం వరకు సబ్సిడీలు ఉంటాయన్నారు. మంగళవారంనాడాయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన రహదారిలోని పార్కింగ్ కేంద్రాల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను పరిశీలించారు. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకోసం నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ సంస్థ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ప్రోగ్రాంను రూపొందించామని తెలిపారు. ఔత్సహికులు స్థానిక అసిస్టెంట్ ఇంజినీరుకు తెలియజేస్తే, ఆ ప్రదేశాన్ని పర్యటించి వివరాలు నమోదు చేసుకుంటారని చెప్పారు. సీఎమ్‌డీ వెంట డైరెక్టర్ ఆపరేషన్స్ డాక్టర్ నరసింహులు, మెట్రో జోన్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్, ఎస్‌ఈ వెంకన్న, డీఈ నెహ్రు నాయక్ తదితరులు ఉన్నారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్లకు సబ్సిడీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES