– కోన సముందర్ విండో చైర్మన్ సామ బాపురెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి సింగిల్ విండోల ఆధ్వర్యంలో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జైలుకు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ సామా బాపురెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని కోన సముందర్ సహకార సంఘం ఆధ్వర్యంలో సబ్సిడీ పై జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ సామా బాపురెడ్డి మాట్లాడుతూ జీలుగు సాగు చేయడం వలన చౌడు నేలలను బాగు చేసుకుని, పంట దిగుబడిని పెంచుకోవచ్చు అన్నారు. జీలుగా పైరు వలన నేల భౌతిక స్థితి మెరుగుపడి నేలకు నీటిని, పోషకాలను నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు. తద్వారా జీలుగు పైరు సాగు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒక బస్తా జీలుగు రెండు నుంచి మూడు ఎకరాలకు సరిపోతుందని తెలిపారు. జిలుగు వాడడం వలన ఎకరానికి ఒక బస్తా యూరియా భారం రైతుకు తగ్గుతుంది అన్నారు.జీలుగు విత్తనాలు అవసరమైన రైతులు తమ భూమి పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తీసుకువచ్చి రాయితీ విత్తనాలను పొందాలని సూచించారు. 30 కిలోల జీలుగు బస్తా పూర్తి ధర 4275 రూపాయలు ఉండగా 50 శాతం రాయితీపై 2173.50 రూపాయలకే రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాలావత్ ప్రకాష్, విండో ఉపాధ్యక్షులు ఆకుల రాజన్న, డైరెక్టర్లు ఇటుకల శ్రీనివాస్, బద్ధం నవీన్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంతి సాయన్న, సబ్యులు, రైతులు, విండో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES