- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలానికి వచ్చిన సబ్సిడీ శనగ విత్తనాల అమ్మకాలను మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏ ఈ ఓ లు సంపత్, విశాల్ గౌడ్, ఆధ్వర్యంలో సోమవారం రైతులకు అమ్మకాలు జరిపారు. మండలానికి దాదాపు ఒక్కొక్క క్లస్టర్ పరిధికి 80 బ్యాగుల చొప్పున వచ్చినట్లు ఏ ఈ ఓ లు తెలిపారు. ఇప్పటివరకు 400 పైన బ్యాగులు అమ్మకాలు జరిగినట్లు ఒక్కొక్క 25 కిలోల బ్యాగు సబ్సిడీతో రూ.1500 చొప్పున అమ్మబడుతున్నట్లు వారు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో సబ్సిడీ శనగ విత్తనాలు అమ్మకాలు పూర్తి అయ్యే దశలో ఉన్నట్లు వారు తెలిపారు. అమ్మకాలపై రైతులకు రసీదులు ఇస్తున్నారా అని అడగగా ఆన్లైన్ లో రైతుల పట్టా సర్వే నంబర్ ఆధార్ కార్డు ఫీడ్ చేయడం జరుగుతుందని ఏఈవోలు తెలిపారు.
- Advertisement -



