‘ఫేజ్-2’ కోసం రూ.600 కోట్లు కేటాయింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సర్కారు భారీ ప్రాధాన్యతనిచ్చింది. ఈ మేరకు ప్రాథమికంగా రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో
నగర జీవనాడిగా మారిన హైదరాబాద్ మెట్రో రైలును ప్రయివేట్ సంస్థ (ఎల్‌అండ్‌టీ) నుంచి ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించడం ఒక చారిత్రాత్మకమైన, ప్రజానుకూలమైన నిర్ణయమని భట్టి విక్రమార్క అభివర్ణించారు. ప్రస్తుతం రోజుకు 5లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న మెట్రో వ్యవస్థను, నగరంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
76.4కి.మీ. మేర కొత్త కారిడార్లు
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర నూతన మార్గాలను నిర్మించాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో ఐదు కొత్త కారిడార్లు ఉండనున్నాయి. పాతబస్తీ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కారిడార్లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైటెక్‌సిటీ అవతల ప్రాంతాలకు కూడా మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24 వేల కోట్లకుపైగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఈ నిధులను సమకూర్చనుంది.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు భారీ నిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



