- Advertisement -
నవతెలంగాణ – మెండోర
అంబేద్కర్ మాదిగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సావెల్ గ్రామ ఉప సర్పంచ్ చిట్యాల రాజు కుమార్ ను సంఘం తరఫున సంఘ సభ్యులు , మహిళలు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. దళిత సంఘాల నాయకుడు దోనుపాల గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామ పాలన బాధ్యతలను ప్రజల ఆశలకు అనుగుణంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధిలో ఉప సర్పంచ్ పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాదిగ సంఘం సభ్యులు , యువకులు , మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



