విద్యుత్ సరఫరాలో అంతరాయం..
ఇబ్బందుల్లో గ్రామస్తులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామంలో 11 కెవి సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ (ఆర్టిజన్) ఆపరేటర్ తాను డ్యూటీ చేస్తున్న రోజులు మద్యం మత్తులో మునిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి తాము ఇబ్బందులకు గురివుతున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకూ ఎండలు దంచి కొట్టడంతో పొద్దంతా ఉక్కపోత,రాత్రంతా దోమల బాధ దీనికి తోడుగా విద్యుత్కు అంతరాయం కలగడంతో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. ఈ ఆపరేటర్ డ్యూటీలో ఉన్నప్పుడల్లా విద్యుత్ సరఫరాలో ఏర్పడడం పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
అతను విధుల్లో ఉన్న రోజులు అతని స్నేహితున్నీ తీసుకొని వచ్చి ఇద్దరు ఫుల్ గా మద్యం సేవించి అపరేటివ్ గదిలో పడకేయడం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేమిటి డ్యూటీ టైంలో మద్యం సేవించడం తప్పు కదా, రాత్రి వేళలో కరెంట్ లేక తాము ఇబ్బందులకు గురివుతున్నామని గ్రామస్తులు పలువురు ఆపరేటర్ ను నిలదీసి, సంబంధించిన విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకపోయినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఆ తాగుబోతు ఆపరేటర్ను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సంఘటనపై మండల విద్యుత్ శాఖ ఇంఛార్జి ఏఈని నవ తెలంగాణ వివరణ కోరగా తన దృష్టికి వచ్చిందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ ఆపరేటర్ పక్కన పెట్టి మరో ఆపరేటర్ ను నియమిస్తామన్నారు.



