Friday, January 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుథియేటర్లలోనూ విజయం ఖాయం

థియేటర్లలోనూ విజయం ఖాయం

- Advertisement -

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్‌ కుమార్‌ నిర్మించారు. ఈ సిరీస్‌కి వచ్చిన రెండు సీజన్స్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. తాజాగా మేకర్స్‌ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. ‘కానిస్టేబుల్‌ కనకం చాప్టర్‌ 3: కాల్‌ ఘాట్‌’ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. ‘కాల్‌ ఘాట్‌ చాప్టర్‌ 3’ గ్లింప్స్‌ని దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్‌ లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ,’సాయిబాబా తన అనుభవాన్ని అంతా కలబోసి ‘కానిస్టేబుల్‌ కనకం’ అనే విజయవంతమైన ఫిల్మ్‌ చేశారు.

వర్ష చాలా మంచి ఆర్టిస్ట్‌. డైరెక్టర్‌ ప్రశాంత్‌ కూడా చాలా చక్కగా తీశాడు. సాయి కృష్ణ, నితిన్‌ లక్కీ హాండ్స్‌. వీళ్ళ సక్సెస్‌ రేట్‌ చాలా బాగుంది’ అని అన్నారు. ‘ఈ యూనిట్‌ ఈ విజయ పరంపరని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత అశ్వినీదత్‌ చెప్పారు. వర్షా బొల్లమ్మ మాట్లాడుతూ,’ఒక నటిగా చాలా సంతప్తిరించిన సిరిస్‌ ఇది’ అని తెలిపారు. ”కాల్‌ ఘాట్‌’ చాలా ఇంపాక్ట్‌ ఫుల్‌గా ఉండబోతుంది. మీ అందరినీ కచ్చితంగా అలరిస్తుంది’ అని డైరెక్టర్‌ ప్రశాంత్‌ అన్నారు. ఈటీవీ విన్‌ సాయికృష్ణ మాట్లాడుతూ,’రెండు సీజన్లు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. చాప్టర్‌ 3 నేరుగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేయబోతున్నాం. బాపినీడు విజన్‌ వలనే ఇది సాధ్యమైంది. ‘అరుంధతి’ కంటే పెద్ద స్కేల్‌లో చాప్టర్‌ 3ని నిర్మించాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -