నవతెలంగాణ-హైదరాబాద్: అన్ని శాఖల సమన్వయంతో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 40 అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు ఈసారి పెరిగాయన్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే బడా గణేశుడి నిమజ్జనం పూర్తయిందని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో సీపీ మాట్లాడారు.
శోభాయాత్రలో జరిగిన గొడవలపై 5 కేసులు నమోదు చేశామని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మందిని పట్టుకున్నామన్నారు. నిమజ్జనంలో సాంకేతికతను ఉపయోగించామని చెప్పారు. 9 డ్రోన్లు వాడినట్లు తెలిపారు. 25 హైరైజ్ భవనాలపై కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేశామని సీపీ వివరించారు. సీఎం ఆకస్మిక తనిఖీ చేయడం మంచిదేనని.. దీని వల్ల ఎలాంటి సమస్య రాలేదన్నారు.