Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విజయవంతమైన జెవీవీ వైజ్ఞానిక తరగతులు

విజయవంతమైన జెవీవీ వైజ్ఞానిక తరగతులు

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి  
జన విజ్ఞాన వేదిక తెలంగాణ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వైజ్ఞానిక శిక్షణా తరగతులు జిల్లా కేంద్రంలోని సివి రామన్ జూనియర్ కళాశాలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నూతన ఐదు జిల్లాల పరిధిలోని జన విజ్ఞాన వేదిక తెలంగాణ నాయకుల, కార్యకర్తల కోసం వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ జితేందర్ అధ్యక్షత వహించగా జెవివి రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరమణ వనపర్తి జిల్లా జె వి వి గౌరవ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ వీరయ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో ఒకవైపు అభివృద్ధి  జరుగుతుండగా వాటిని ఉపయోగించుకుని సామాన్య ప్రజలను మూఢనమ్మకాల వైపు మరల్చి మోసం చేయడం కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ప్రజల్లోనికి తీసుకువెళ్లి అవగాహన కల్పించాల్సిన బాధ్యత జన విజ్ఞాన వేదిక వంటి సైన్స్ ఆర్గనైజేషన్స్, మేధావులు, విద్యావంతుల పై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐదు జిల్లాల జేవిబి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -