– రైతు బజార్,ఫుడ్ ఫేస్ట్ తో విద్యార్థుల్లో నూతనొత్సాహం
– విద్యార్థుల్లోని నైపుణ్యతను వెలికి తీసేందుకే కార్యక్రమం
– గ్లోబల్ పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ
నవతెలంగాణ-కేశంపేట:
నిత్య జీవితంలో స్వయం ఉపాధిని ఎలా రూపొందించుకోవాలో, ప్రతి రంగంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకునే విధంగా విద్యార్థుల్లోని నైపుణ్యతను వెలికి తీసేందుకే ఈరైతుబజారు కార్యక్రమం నిర్వహించామని కేశంపేట మండల కేంద్రంలోని గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు.బుధవారం గ్లోబల్ స్కూల్ ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన రైతు బజార్,ఫుడ్ ఫేస్ట్ కార్యక్రమం విజయవంతమైనది.

ఈసందర్భంగా ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూవిద్యార్థులే రైతులుగా తాము పండించిన కూరగాయలను రైతు బజారులో అమ్ముకోవడం, ఫుడ్ ఫేస్ట్ తో పదిమందిని మెప్పించి ఎలా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలో తెలుసుకున్న రహస్యాలతో విద్యార్థుల్లో నూతనోత్సాహం కొట్టొచ్చునట్లు దర్శనమిచ్చిందన్నారు. విద్యార్థులంతా రైతుగా,వ్యాపారులుగా ఉత్సాహంతో తమ తమ పాత్రలో లీనమైపోయారని వివరించారు. విద్యార్థుల్లోని నైపుణ్యతను వెలికి తీసేందుకే ఈరైతు బజార్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు




