Tuesday, April 7, 2026
E-PAPER
Homeసినిమాఅలాంటి హిట్‌ ఖాయం

అలాంటి హిట్‌ ఖాయం

- Advertisement -

నాగ శౌర్య హీరోగా రామ్‌ దేశినా (రమేష్‌) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా ‘బ్యాడ్‌ బాయ్ కార్తీక్‌’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌ బ్యానర్‌ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్నారు.
ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్‌ సోమవారం థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘మా ప్రొడ్యూసర్‌ ఈ సినిమా జరగాలని ఎంతో పట్టుదలతో ముందుకు తీసుకొచ్చారు. ఆయనకి హ్యాట్సాఫ్‌. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్‌, పేరు రావాలని కోరుకుంటున్నాను. ‘ఆరెంజ్‌’ సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్‌ జయరాజ్‌తో వర్క్‌ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఆయన చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. అలాగే రసూల్‌తో వర్క్‌ చేస్తే ఎలా ఉంటుందో అనుకునేవాడిని. ఆయన కెమెరాలో నేను ఎలా కనిపిస్తానో చూడాలని ఉండేది. ఈ సినిమా ద్వారా అది సాధ్యమైంది. నన్ను చాలా బాగా చూపించారు.

ప్రభాస్‌ ‘ఈశ్వర్‌’ సినిమాలో శ్రీదేవిని చూసాను. అలాంటి అదృష్టం నాకు కూడా ఈ సినిమాతో రావాలని కోరుకున్నాను. శ్రీదేవి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన వెన్నెల కిషోర్‌కి, సముద్రఖనికి, సాయికుమార్‌కి, టీమ్‌ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని తెలిపారు. ‘మా ప్రొడ్యూసర్‌ ఇంకా చాలా మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌. ఇది ఒక లాంగ్‌ జర్నీ, చాలా మంచి అనుభవం. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్‌ చేశాను. శౌర్యతో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశాను. ఆయన చాలా ట్యాలెంటెడ్‌. మీరు తప్పకుండా ఈ సినిమా చూసి ఎంజారు చేస్తారని నమ్ముతున్నాను’ అని శ్రీదేవి విజయ్ కుమార్‌ చెప్పారు. డీఓపీ రసూల్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా నాకు చాలా విధాలుగా మంచి అనుభవం ఇచ్చింది. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు. ‘ఇది మా ఫస్ట్‌ సినిమా. శౌర్యతో కలిసి ఒక మంచి సినిమా తీశాం. జీ వారికి ఈ సినిమా చూపించగానే, ఓటిటి రైట్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌ కూడా వారే చేస్తామని చెప్పారు. ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదు. కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిక్యూటివ్స్‌ అందరూ చాలా హ్యాపీ. ‘ఛలో’ తర్వాత అలాంటి మంచి హిట్‌ మళ్లీ రాబోతుంది’ అని ప్రొడ్యూసర్‌ శ్రీనివాసరావు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -