నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో శనివారం ఉదయం బస్సులో నుండి పొగరు రావడంతో ప్రయాణికులు ఒకేసారి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వెంటనే అప్పమత్తమైన బస్సును నిలపడంతో ఆబదాబరగా కిందికి దిగిపోయారు. ఈ సందర్బంగా ప్రయాణికులు మాట్లాడుతూ.. కెపాసిటీ మించి ప్రయాణికులు ఉండడంతో బస్సులో పొగలు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్ను వివరణ కోరగా.. బస్సు లైనర్లు పట్టుకోవడంతో ఈ సంఘటన జరిగినట్టు తెలిపారు. ఈ బస్సు కామారెడ్డి నుండి నిజామాబాదుకు వెళుతుండగా సంఘటన చోటు చేసుకున్నది. టీఎస్ 17 టి 26 26 బస్సు లో వెలుతున్నారు. పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ.. ఉచిత బస్సు వల్ల ప్రతి ఒక్కరు ఎక్కువ మంది ప్రయాణించడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టున్నారు. గతంలో ఎక్కువగా ఆర్డినరీ బస్సులు ఉండేవని తెలిపారు ప్రస్తుతం ఆడినరీ బస్సులను రద్దుచేసి ఎక్కువ బస్సులను ఎక్స్ప్రెస్ గా మార్చడంతో సరిపోకపోవడం వల్ల ఇటువంటి సంఘటన అన్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఎక్స్ప్రెస్ ను తగ్గించి ఆర్డినరి బస్సులను పెంచాలని కోరుతున్నారు.
అకస్మాత్తుగా బస్సులో పొగలు.. అప్రమత్తమైన డ్రైవర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



