Wednesday, September 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, సుమారు 18 మంది గాయపడ్డారు. బలోచిస్థాన్‌ నేషనల్‌ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్‌ వర్ధంతి సందర్భంగా బలోచ్‌ రాజధాని క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశం నిర్వహించింది. సభకు వందలాది మంది బలోచ్‌ మద్దతుదారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనాస్థలంలోనే పలువురు ప్రాణాలొదిలారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయకచర్యలు ప్రారంభించనట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి. దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -