Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు.. బయటపడ్డ కీలక విషయాలు

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు.. బయటపడ్డ కీలక విషయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొరియన్ లవ్ గేమ్ వ్యసనం కారణంగా బాలికలు ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసులో తాజాగా కీలక విషయాలు బయటపడ్డాయి. సదరు అక్కాచెల్లెళ్ల కుటుంబం మొత్తం గందరగోళంగానే ఉందని తెలుస్తోంది. మరణించిన బాలికలకు తండ్రితో అటాచ్ మెంట్ ఎక్కువగా ఉందని వారి సూసైడ్ లేఖ వెల్లడిస్తోంది. వారి తండ్రికి ముగ్గురు భార్యలు ఉన్నారని, ఆ ముగ్గురూ సొంత అక్కాచెల్లెళ్లేనని తాజాగా వెలుగులోకి వచ్చింది.

ముగ్గురిని పెళ్లాడిన సదరు తండ్రి.. గతంలో ఓ మహిళతో లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. రాజేంద్ర నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఆమెతో లివిన్ లో ఉన్నట్లు తేలింది. 2015 లో సదరు మహిళ అనుమానాస్పద రీతిలో బిల్డింగ్ పైనుంచి పడి మరణించిందని, ఆత్మహత్యగా భావించి ఈ కేసును కొట్టేశామని డీసీపీ నిమిశ్ పాటిల్ తెలిపారు. బాలికల తండ్రి వ్యాపారంలో నష్టపోయాడని, రూ.2 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఇప్పటికే తెలిసిందని చెప్పారు. కుటుంబ సంబంధాల్లో ఈ గందరగోళం కూడా బాలికల ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలోనూ దర్యప్తు జరుపుతున్నట్లు డీసీపీ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -