నవతెలంగాణ- రామన్నపేట
నేత పని సరిగా లేక.. తెచ్చిన అప్పుకు ఈఎంఐ కట్టేందుకు డబ్బుల్లేక చేనేత కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు(39) చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగించేవాడు. చేనేత మెటీరియల్ నిమిత్తం ఐదేండ్ల కిందట భువనగిరి పట్టణంలోని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నారు. ప్రతి నెలా వాయిదాలు కడుతుండగా కొన్ని నెలలుగా వృత్తిపని సరిగ్గా సాగకపోవడంతో రెండు నెలలు ఈఎంఐ పెండింగ్ పడింది. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక మనస్తాపానికి గురై బాలరాజు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కార్మికుని భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బాలరాజు భార్య మిర్యాల అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ డి.నాగరాజు తెలిపారు.
చేనేత కార్మికుని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



