నవతెలంగాణ – తాడ్వాయి : మండల కేంద్రంలోని ఇందిరానగర్ కు చెందిన పెద్ది శృతి (19) అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పైన తెలిపిన విధంగా ఇందిరానగర్ కు చెందిన పెద్ది శృతి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మేనమామ అయిన బండి శ్రీను ఇంట్లో ఉండి చదువుకుంటుంది. ఆమె అలనా పాలన మేనమామను చూసుకుంటున్నాడు. ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయిందని మనస్థాపానికి గురై శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి పడిపోయింది. గ్రహించిన మేనమామ దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడి నుండి మెరుగైన వైద్యం గురించి 108 ద్వారా ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. డ్యూటీ డాక్టరు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మేనమామ బండి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పురుగుల మందుతాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES