Wednesday, April 1, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఉదయం ఉక్కపోత సాయంత్రం ఈదురుగాలులు

ఉదయం ఉక్కపోత సాయంత్రం ఈదురుగాలులు

- Advertisement -

ఐదు రోజులు వానలు
రాష్ట్రంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ : వాతావరణ శాఖ
హైదరాబాద్‌ :
ద్రోణి, గాలి అనిశ్చితితో పాటు ఉపరితల చక్రవాకం ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలకు బుధవారం ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందనీ, రాత్రి వేళల్లో ఉక్కపోత వాతావరణం ఉంటుందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -