Sunday, October 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుముగిసిన సుమిత్రాబాయి అంత్యక్రియలు

ముగిసిన సుమిత్రాబాయి అంత్యక్రియలు

- Advertisement -

నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి, నల్లమోతు, తిప్పన మాజీ ఎమ్మెల్సీలు చెరుపల్లి, అలుగుబెల్లి

నవతెలంగాణ-మిర్యాలగూడ
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌ సతీమణి సుమిత్రాబాయి అంత్యక్రియలు శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పూర్తయ్యాయి. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు చెరు పల్లి సీతారాములు, అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మీ సంద ర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ, సయ్యద్‌ హాసం, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, ప్రభావతి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, నాయకులు నూకల జగదీష్‌ చంద్ర, పారేపల్లి శేఖర్‌రావు, ఎండి సలీం, సత్తయ్య, రవి నాయక్‌, డా.మల్లు గౌతమ్‌ రెడ్డి, బావండ్ల పాండు, వరలక్ష్మి, సీతారాములు, రెమిడాల పరుశురాములు, వినోద్‌ నాయక్‌, శశిధర్‌ రెడ్డి, రొండి శ్రీనివాస్‌, అయూబ్‌, ఎంసీపీఐయూ రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య, టీడీపీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు నూకల వేణుగోపాల్‌ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -