- Advertisement -
కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీని భారీగా పెంచుతూ ఆల్ఫాబెట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. రానున్న మూడేండ్ల కాలానికి గాను ఆయన ప్యాకేజీని 692 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 6,361 కోట్లు) పెంచినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఇందులో 2 మిలియన్ డాలర్ల వార్షిక జీతంతో పాటు, కంపెనీ నిర్దేశించిన లక్ష్యాల ఆధారంగా అందే పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లు, షేర్లు ఉన్నాయి. ఏఐ రంగంలో గూగుల్ దూసుకుపోతున్న తరుణంలో పిచారు నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఈ భారీ పెంపును ప్రకటించారు. 2015లో ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్లకు పెరగడం విశేషం.
- Advertisement -



