Saturday, July 26, 2025
E-PAPER
Homeసినిమారెండు ప్రేమకథలతో 'సుందరకాండ'

రెండు ప్రేమకథలతో ‘సుందరకాండ’

- Advertisement -

హీరో నారా రోహిత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ బ్యానర్‌పై సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకులని అలరించింది. బ్యాచిలర్‌గా రోహిత్‌ పాత్రని ప్రజెంట్‌ చేసిన విధానం అందరికీ నచ్చింది. ఈ సినిమా హ్యూమర్‌, సోల్‌ఫుల్‌ రిఫ్రెషింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించ బోతుందని టీజర్‌ తెలియజేసిందని చిత్ర యూనిట్‌ చెప్పింది. శుక్రవారం నారా రోహిత్‌ పుట్టినరోజు సందర్భంగా మూవీ రిలీజ్‌ డేట్‌ని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.
ఆగస్టు 27న గణేష్‌ చతుర్థి రోజున ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. బుధవారం విడుదలతో ఈ చిత్రానికి లాంగ్‌ వీకెండ్‌ కలిసొస్తుంది. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ నారా రోహిత్‌ జీవితంలోని వివిధ దశలలోని రెండు ప్రేమకథలను ప్రజెంట్‌ చేస్తోంది. ఇందులో నారా రోహిత్‌ డిఫరెంట్‌ టైం లైన్స్‌లో కనిపించారు. ఒకటి శ్రీదేవి విజరు కుమార్‌తో కలిసి మొదటి ప్రేమలోని అమాయకత్వాన్ని చూపించగా, మరొకటి వతి వాఘానితో కలిసి సెకండ్‌ లవ్‌ ఛాన్స్‌ని సూచిస్తుంది. నరేష్‌ విజయ కష్ణ, వాసుకి ఆనంద్‌, సత్య, అజరు, వీటీవీ గణేష్‌, అభినవ్‌ గోమటం, విశ్వంత్‌, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: వెంకటేష్‌ నిమ్మలపూడి, నిర్మాతలు: సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి, డీఓపీ : ప్రదీష్‌ ఎం వర్మ, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, ఎడిటర్‌: రోహన్‌ చిల్లాలే, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజేష్‌ పెంటకోట, సాహిత్యం: శ్రీ హర్ష ఈమని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ: పథ్వీ మాస్టర్‌, డాన్స్‌ కొరియోగ్రఫీ: విశ్వ రఘు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -