- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. 150మంది వరకు క్రీడాకారులు, రైల్వే ఉద్యోగులు, అధికారులు సైక్లింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -