న్యూఢిల్లీ : భారత ఫుట్‌బాల్ స్టార్, అత్యధిక గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రి అంతర్జాతీయ సాకర్‌కు వీడ్కోలు పలికాడు. ఏఎఫ్‌సీ కప్ 2027కు భారత్‌కు అర్హత సాధించకపోవటంతో సునీల్ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2024 జూన్‌లోనే సునీల్ ఛెత్రి ఆటకు వీడ్కోలు పలికాడు. అప్పటి భారత కోచ్ మనాలో మార్కెజ్ కోరటంతో రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సునీల్ ఛెత్రి.. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో బ్లూ టైగర్స్ తరఫున బరిలోకి దిగాడు. భారత్ ఆరు మ్యాచుల్లో సునీల్ ఛెత్రి కేవలం ఒక్క గోల్ మాత్రమే కొట్టాడు. 41 ఏండ్ల సునీల్ ఛెత్రి 157 మ్యాచుల్లో 95 గోల్స్ సాధించాడు. జాతీయ జట్టుకు దూరమైనా.. క్లబ్ ఫుట్‌బాల్‌లో సునీల్ ఛెత్రి బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహించనున్నాడు.



