Tuesday, June 10, 2025
E-PAPER
Homeసినిమాకీలక పాత్రలో సునీల్‌

కీలక పాత్రలో సునీల్‌

- Advertisement -

రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ విజరు మిల్టన్‌ దర్శకుడిగా ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నటుడు సునీల్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
తెలుగు చిత్రసీమలో విభిన్న శైలితో ో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్‌ ‘మర్యాద రామన్న’, ‘అందాల రాముడు’, ‘పుష్ప’ వంటి విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సునీల్‌ పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకమైనది. హాస్యం, హద్యత, భావోద్వేగాలు మిళితమైన ఈ పాత్ర ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని పరిచయం చేయనుంది. ఇది ఆయన సినీ ప్రయాణంలో ఒక విభిన్నమైన మలుపు అని చెప్పవచ్చు అని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు విజరు మిల్టన్‌ మాట్లాడుతూ, సునీల్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే నటుడు మాత్రమే కాదు, ఒక సహజ నటనకు నిలువెత్తు ఉదాహరణ. ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్ర, ఆయన ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైనది. ఇది హదయానికి హత్తుకునే, చాలా సహజమైన పాత్ర’ అని తెలిపారు. చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను ఈనెల 15న విడుదల చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -