నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో పలువురు బాధ్యత కుటుంబాలను ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన జైడి బాలు వాళ్ళ అమ్మ బాలవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో శ్రీరాముల సుమన్ వాళ్ల నాన్న దశరథ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, అజ్మత్ హుస్సేన్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



