Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సునీల్ రెడ్డి పుట్టినరోజు.. విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పెన్నులు పంపిణీ

సునీల్ రెడ్డి పుట్టినరోజు.. విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పెన్నులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-మెండోర
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా వెల్గటూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నోట్‌బుక్‌లు , పెన్నులను , పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షుడు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పెన్నులను, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సునీల్ రెడ్డి ఎటువంటి కల్మషం లేకుండా అభివృద్ధికి పాటుపడుతూ నిరంతరం ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఆయన నాయకుడిగా దొరకడం నియోజకవర్గానికి అదృష్టం అని కొనియాడారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. ఈ కార్యక్రమములో డిసిసి ఉపాధ్యక్షులు సోమ్ రాజేంధర్, గ్రామ సర్పంచ్ కావ్య సతీష్ , ఉప సర్పంచ్ బద్దం శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సాధక్, రవి, రంజిత్‌రెడ్డి, అంజయ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -