Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంగాంధీభవన్‌లో సునీతారావు ధర్నా

గాంధీభవన్‌లో సునీతారావు ధర్నా

- Advertisement -

– క్రమశిక్షణ ఉల్లంఘనే :మహేశ్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ మహిళా నేతలకు నామినేటేడ్‌ పదవులు ఇవ్వాలని ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు డిమాండ్‌ చేశారు. పోస్టుల విషయంలో పార్టీ మహిళా నాయకులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్‌, గాంధీభవన్‌లో ఉన్న టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఛాంబర్‌ ముందు ఆమె ధర్నాకు దిగారు. పది మంది మహిళా నాయకులతో కలిసి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి జోడు పదవులు ఇస్తున్నారని, మహిళా విభాగాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. రెడ్డి, గౌడ్‌ సామాజిక తరగతుల వారికే పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చెల్లెలు, మరదలు అయితే పదవులు వస్తున్నాయని విమర్శించారు. ఒకరికి రెండు పదవులు ఇవ్వటం కుదరంటూ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అంటున్నారనీ, ఆయనకు మాత్రం ఎమ్మెల్సీ, అధ్యక్ష పదవి రెండు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆయన ఒక పదవి వదులుకుని మహిళలకు ఇవ్వాలని కోరారు.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదు : టీపీసీసీ
గాంధీభవన్‌లోని తన ఛాంబర్‌ వద్ద సునీతారావు ధర్నా చేయడం క్రమశిక్షణా రాహిత్యమేనని మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళతానన్నారు. సునీతారావుపై గాంధీభవన్‌ ఇన్‌చార్జి కుమార్‌రావు ఏఐసీసీకి, కాంగ్రెస్‌ మహిళా జాతీయ అధ్యక్షులు, క్రమశిక్షణ కమిటీ చైర్మెన్‌ చిన్నారెడ్డిలకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ హామీతో ఆమె ఆందోళన విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -