పర్యవేక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి
జీహెచ్‌ఎంసీ,హైడ్రా అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి
ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీయాలని ఆదేశం
హైదరాబాద్ : మూసీ వరద ప్రవాహం ఎంజీబీఎస్‌నూ ముంచెత్తింది. మోకాలిలోతులో నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఘటనాస్థలిపై ఆరాతీశారు. సత్వరమే చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులను పురమాయించారు. ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించాలని సూచించారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో వరదముంపు ప్రభావిత ప్రాంతాలపై సమీక్షించారు.చాదర్ ఘాట్ చిన్నవంతెన, మూసారంబాగ్‌తో సహా పలు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.