Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెల్పిన సుంకిరెడ్డి 

వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెల్పిన సుంకిరెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-ఆమనగల్ 
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో వేం నరేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి  పూల మొక్క అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. పార్లమెంట్ లో ఆయన తెలంగాణ ప్రజల సమస్యలను బలంగా వినిపిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో  చేపడుతున్న సేవా కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం తదితర అంశాలపై ఆయనతో చర్చించినట్లు సుంకిరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -