సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ – నకిరేకల్
సుంకి యాదగిరి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నర్ర రాఘవరెడ్డి భవనంలో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుంకి యాదగిరి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) బలోపేత కోసం యాదగిరి ఎనలేని సేవ చేశారన్నారు. ప్రాణం ఉన్నంతవరకు ఎర్రజెండాను వీడకుండా పేద ప్రజల పక్షాన నిలబడి అనేక సమస్యలపై పోరాటం నిర్వహించారని కొనియాడారు. యాదగిరి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు నకిరేకల్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ వీధిలో చూసినా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి వర్షాలకి వీధులన్నీ బురదమయమై పాదాచారులు నడవలేని పరిస్థితి పేర్కొందన్నారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ సుంకు మన్నెమ్మ, మండల నాయకులు చెన్న బోయిన నాగమణి, వంటేపాక కృష్ణ, సాకుట్ల నరసింహ, గునుగుంట్ల బుచ్చి రాములు, పన్నాల శశికళ, గురుజ స్వరూప, సుంకి శోభన్, ఆదిమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సుంకి యాదగిరి ఆశయాలను సాధించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES