– ఢిల్లీ క్యాపిటల్స్‌తో డీ నేడు
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్ 18 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు సర్వ శక్తులూ వడ్డేందుకు సిద్ధమైంది. గత ఆరు మ్యాచుల్లో నాలుగు పరాజయాలు చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ తలపడనుంది. నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి కానుండగా.. ఢిల్లీకి సైతం ఓటమి సమీకరణాలు కఠినంగా మారనున్నాయి. టాప్-4లో చోటు కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ సహా గుజరాత్ టైటాన్స్‌లు గట్టిగా పోటీపడుతున్నాయి. దీంతో నేడు ఉప్పల్‌లో విజయమే లక్ష్యంగా సన్‌రైజర్స్, క్యాపిటల్స్ బరిలోకి దిగుతున్నాయి.
మెరుస్తారా? :
సన్‌రైజర్స్ పవర్‌ప్లేలో పేలవ ఆట తీరు ఓటములకు ప్రధాన కారణం!. అభిషేక్ శర్మ భారీ స్కోర్లతో మెరిసినా.. గత సీజన్ తరహాలో నిలకడ లోపించింది. ట్రావిశ్ హెడ్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఈ ఇద్దరు ఆరు ఓవర్లలో చేసే విధ్వంసమే సన్‌రైజర్స్ భారీ స్కోరుకు పునాది. ప్లే ఆఫ్స్ రేసుకు దూరమయ్యే ప్రమాదం నేపథ్యంలో అభిషేక్, హెడ్ సహా హెన్రిచ్ క్లాసెన్‌లు నేడు ఉప్పల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు. బౌలింగ్ ఇటీవల ఆరెంజ్ ఆర్మీకి సమస్యగా మారింది. మహ్మద్ షమి, పాట్ కమిన్స్ అంచనాలను అందుకోవటం లేదు. క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పేసర్లు మెరుస్తారేమో చూడాలి.
సన్‌రైజర్స్‌కు చావోరేవో
- Advertisement -
- Advertisement -