ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగియకముందే, సూపర్8 బెర్త్‌లు ఖరారు అయ్యాయి. బుధవారం పాకిస్తాన్, నమీబియా మ్యాచ్‌లో పాక్ విజయం సాధించటంతో.. గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు పాకిస్తాన్ ముందంజ వేసింది. దీంతో సూపర్8 రేసుకు తెరపడింది. గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించగా.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ చేరుకున్నాయి.
గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే ఆఖరు8కు చేరాయి. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌కు భంగపాటు తప్పలేదు. శుక్రవారంతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగియనుండగా.. శనివారం నుంచి సూపర్8 సవాల్ షురూ కానుంది. సూపర్8లో గ్రూప్-1లో ఆతిథ్య భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉండగా.. గ్రూప్-2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. సూపర్8లో భారత్ ఈ నెల 22న దక్షిణాఫ్రికాతో (అహ్మదాబాద్‌లో), 28న జింబాబ్వేతో (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్‌తో (కోల్‌కతాలో) ఆడనుంది.
సూపర్8 గ్రూప్‌లు
గ్రూప్-1 : భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా
గ్రూప్-2 : ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక
సూపర్8 బెర్త్‌లు ఖరారు
- Advertisement -
- Advertisement -



