Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసూపర్‌ రెస్పాన్స్‌

సూపర్‌ రెస్పాన్స్‌

- Advertisement -

చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై చింతా వినీషరెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించారు.
వినయ్ రత్నం దర్శకుడు. ఈనెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి, ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశసంలు అందుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ,’ఈ సినిమాకు ప్రీమియర్స్‌ దగ్గర నుంచే మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది.

ఇప్పుడు సినిమా విడుదల తరువాత అందరి నుంచి మంచి స్పందన వస్తోంది’ అని తెలిపారు. ‘కొత్త టీమ్‌తో చేసిన సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. సినిమా చూసిన వాళ్లు బాగుందని ఫోన్‌ చేస్తున్నారు. ఈ విజయానికి కారణమైన అందరికి థ్యాంక్స్‌. నిర్మాతగా ఈ సినిమా కమర్షియల్‌గా కూడా హ్యపీగా ఉన్నాను. మా ప్రయత్నంలో ఉన్న నిజయితీని గుర్తించారు. త్వరలో మరో కొత్త దర్శకుడితో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను’ అని చింతా గోపాల కృష్ణారెడ్డి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -