Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్మండల స్థాయి ఎఫ్ఎల్ఎం, టిఎల్ఎం మే‌‌‌ళాతో విద్యార్థులకు ఉన్నతమైన బోధన

మండల స్థాయి ఎఫ్ఎల్ఎం, టిఎల్ఎం మే‌‌‌ళాతో విద్యార్థులకు ఉన్నతమైన బోధన

- Advertisement -

– జిల్ల మానిటరింగ్ అధికారి డా,పి.ఎం.షేక్
నవతెలంగాణ – ధర్మారం

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయు లకు ఎఫ్ ఎల్ ఎం – టి ఎల్ ఎం మండల స్థాయి మేళా బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి అయినాల ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఆనంతరం ఉపాధ్యాయులు ప్రదర్శించిన టిఎల్ఎం లను తిలకించి వారిని అభినందించారు అనంతరం ఉత్తమ టిఎల్ఎంలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అకాడమిక్ మానిటరింగ్అధికారి పిఎం షేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర విద్యా వ్యవస్థలో పెద్దపెల్లి జిల్లా ను ముందంజలో ఉండేలా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి  చేయాలని సూచించారు.  పెద్దపెల్లి జిల్లాలోని 14 మండలాల్లో మండల స్థాయి మేళాలు నిర్వహించి అందులో ఎంపికైన పాఠశాలలు ఈనెల 20న జరిగే జిల్లాస్థాయ టి.ఎల్.ఎమ్ మేళాలో పాల్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అధ్యక్షత వహించగా ఎంపీడీవో అయినాల ప్రవీణ్ కుమార్, ఏపిఎం దమ్మాల పోచం, సి సి సత్యనారాయణ, డిఆర్పీలు  సంపత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయు లు మాలతిలత, మల్లేశం, నరేందర్ రావు, వేణుగోపాల్ రెడ్డి ,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, సి ఆర్ పి లు కవిత, శ్రీలత, కుమారస్వామి, ప్రేమ్ సాగర్ మండల ఎం ఆర్ సి సిబ్బంది సునీత, సురేష్, రాజు తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad