Saturday, December 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీవారిని దర్శించుకున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన ఆయన, ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకున్న రజనీకాంత్‌ కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -