– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్ రాములు
నవతెలంగాణ – కామారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం)ని ఆదరించాలని కామారెడ్డి జిల్లాలోని మండల, గ్రామ ప్రజలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్ రాములు కోరారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్, వెంకట్ రాములు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం)ని ప్రజలు ఆదరించి సీపీఐ(ఎం) పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరారు.
పార్టీ పోటీలో లేని దగ్గర లౌకికవాదులకు, ప్రజా స్వామిక వాదులకు పోటీ చేసే ఇతర కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులకు మద్దతు ఉంటుందని తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా అవకాశం ఉన్నచోట్ల సర్పంచ్ స్థానాల్లో, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ ఉంటుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం)ను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లాలో పేద, మధ్యతరగతి ప్రజలకు , కార్మికులకు, రైతు కూలీలకు రైతులకు భూమి పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలని , పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, యువతకు ఉపాధి కల్పించాలని అనేక సమస్యలపై సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం)ని గెలిపించాల్సిన అవసరం పేద మధ్య తరగతి ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి ఉన్నదని అన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల్లో సీపీఐ(ఎం)ని గెలిపించడానికి కార్యకర్తలు సైతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతిరం నాయక్ , కొత్త నరసింహులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక, జిల్లా కమిటీ సభ్యులు ఖలీల్, రవీందర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఆదరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES