Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్ఆపరేషన్ సింధూర్ కు మద్దతు..

ఆపరేషన్ సింధూర్ కు మద్దతు..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ఆపరేషన్ సింధూర్ లో పోరాడుతున్న మన భారత ప్రభుత్వ త్రివిధ దళాలకు  మద్దతుగా దైవభక్తి కూడా భారత సైన్యానికి ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వo దేవాదాయ ధర్మాదాయ ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్ర శివారులో ఉన్నా దక్షిణ కాశీ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ, అర్చకులు రాజేశ్వర శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
మెడికల్ అసోసియేషన్ మద్దతు…
  భిక్కనూరు మండలం మెడికల్ అసోసియేషన్ ఆపరేషన్ సింధూర్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్క భారత సైనికుని వెంట దేశ ప్రజలు ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గజ్జెల భిక్షపతి, ఆలయ సిబ్బంది, మెడికల్ అసోసియేషన్ సభ్యులు రమేష్, అక్తర్ పాష, రమేష్, బారీ, తదితరులు ఉన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -