– అమెజాన్ డైరెక్టర్ సేల్స్ గౌరవ్ వెల్లడి
హైదరాబాద్ : రెఫరల్ ఫీజుల రద్దుతో విక్రేతల అమ్మకాలు పెరిగాయని అమెజాన్ ఇండియా డైరెక్టర్ సేల్స్ గౌరవ్ భట్నాగర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో గౌరవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తమ సంస్థ రూ.300 కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తులపై జీరో రెఫరల్ ఫీజులను అమల్లోకి తెచ్చిందన్నారు. దీంతో తక్కువ ధర కలిగిన వస్తువులపై విక్రేతలకు, కొనుగోలుదారులకు సొమ్ము ఆదా అవుతుందన్నారు. దుస్తులు, బూట్లు, ఫ్యాషన్ నగలు, కిరాణా, గృహాలంకరణ, ఫర్నిషింగ్‌లు, అందం, బొమ్మలు, వంటగది ఉత్పత్తులు, ఆటోమోటివ్, పెంపుడు జంతువుల ఉత్పత్తులు వంటి 135 విభాగాల ఉత్పత్తులపై జీరో రెఫరల్ ఫీజును వర్తింపజేస్తున్నామన్నారు. తెలంగాణలో తమ సంస్థ వేదికలో 50,000 పైగా విక్రేతలు ఉన్నారన్నారు. ఏప్రిల్ 7 నుంచి రూ.300 కంటే తక్కువ ధర కలిగి ఉన్న 1.2 కోట్లకు పైగా ఉత్పత్తులపై జీరో రెఫరల్ ఫీజులను అమలు చేసిందన్నారు. జాతీయ షిప్పింగ్ రేట్లను రూ.77 నుంచి రూ.65కు తగ్గించామన్నారు.
రెఫరల్ ఫీజుల రద్దుతో విక్రేతలకు మద్దతు
- Advertisement -