Friday, December 19, 2025
E-PAPER
Homeబీజినెస్అనాధ బాలల నైపుణ్యాభివృద్ధికి సహకారం

అనాధ బాలల నైపుణ్యాభివృద్ధికి సహకారం

- Advertisement -

ఎంఎన్‌జె ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు
ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ సుధారెడ్డి వెల్లడి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అనాధ బాలల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు ఎంఎన్‌జే కాన్సర్‌ ఆస్పత్రి అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) డైరెక్టర్‌ సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ పది సంవత్సరాల నుంచి యువతలో నైపుణ్యాలను పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణనిస్తున్నదని, అనాధ బాలలు కూడా అలా తమ కాళ్లపై తాము నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌ బ్లాక్‌ను ఎలా అయితే అభివృద్ధి చేసామో అలానే ఎంఎన్‌జె క్యాన్సర్‌ ఆస్పత్రిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. ముందుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడి ఏమి అవసరమో తెలుసుకుని ఆ అవసరాలను తీరుస్తామన్నారు.

ఎంఈఐఎల్‌, ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో అనాధలకు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని బ్లాంకెట్లను ఆమె పంపిణీ చేశారు. ఎంఎన్‌జె క్యాన్సర్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ముద్దాడిన సుధా రెడ్డి వారికి బ్లాంకెట్స్‌, పండ్లు పంపిణీ చేశారు. మూసాపేటలోని సాయి సేవా సంఘ్‌లో విద్యను అభ్యసించే వారికి బ్లాంకెట్స్‌ను సుధారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో, ఆ తరువాత విలేకరులతో సుధా రెడ్డి మాట్లాడారు. నగరంలోని సాయి సేవా సంఘ్‌ విద్యా మందిర్‌ లో ఆనాధలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వారు పదో తరగతి లేదా ఆ పై చదువుల తరువాత తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవించేందుకు తమ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. తనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తి అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -